లెబనాన్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడులు.. 10 నిమిషాల్లోనే విధ్వంసం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐ.డి.ఎఫ్) ఆకస్మికంగా భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ వ్యాప్తంగా వందకు పైగా లక్ష్యాలపై వాయుసేన బాంబుల వర్షం కురిపించింది.

ఈ దాడుల్లో ఇప్పటివరకు 254 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, వెయ్యి మందికి పైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇజ్రాయెల్ దాడులు రాజధాని బీరుట్, వ్యూహాత్మకంగా కీలకమైన బెక్కా వ్యాలీతో పాటు దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. హిజ్బుల్లా స్థావరాలే ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, ఈ దాడుల్లో పలు నివాస భవనాలు కూడా నేలమట్టమయ్యాయి.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, 1982లో జరిగిన లెబనాన్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ చేపట్టిన అతిపెద్ద మరియు అత్యంత విధ్వంసకర దాడి ఇదే. ఈ ఘటనతో ప్రాంతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.