












ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan జల సంరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
కానూరులోని APSIRD భవన్లో నిర్వహించిన ‘గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం’ వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జలమే జీవం… ప్రతి నీటి చుక్క విలువైనది. భవిష్యత్తు తరాల కోసం నీటిని సంరక్షించడం అత్యవసరం” అని పేర్కొన్నారు.
జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థకు అనేక సవాళ్లు ఉన్నాయని, ముఖ్యంగా భూగర్భ జలాలు తగ్గిపోవడం, ఉపరితల జలాల కొరత, కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పారు.
Andhra Pradeshలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులు ప్రజల జీవనాధారమని, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
నీటి వనరులను కాపాడుకోవడంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.