
అమలాపురం: సీనియర్ జర్నలిస్ట్ మరియు జై భవాని సేవా సమితి మీడియా ఇంచార్జ్ గారపాటి పండుబాబు సతీమణి, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యురాలు గారపాటి భాగ్యలక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సతీవియోగంతో విషాదంలో ఉన్న గారపాటి పండుబాబును పలు నాయకులు, స్నేహితులు, జర్నలిస్టులు పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో జై భవాని సేవా సమితి జిల్లా అధ్యక్షులు అర్లపల్లి ముత్యం భవాని, జిల్లా సంయుక్త కార్యదర్శి యెల్లమిల్లి నాగేశ్వరావు, కాట్రేనికోన మండల శాఖ అధ్యక్షుడు సింహాద్రి గణేష్, జర్నలిస్ట్ సత్తి ప్రసాద్ తదితరులు పాల్గొని పండుబాబుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.