
కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భైరవ ప్రసాద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.