అమరావతి సర్కిల్ వద్ద కూటమి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

  1. ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: పార్లమెంట్ సాక్షిగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ కీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ఆమోదం పొందిన చారిత్రాత్మక శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ఆదివారం స్థానిక 24వ డివిజన్ సెంట్ ఆన్స్ వద్ద ఉన్న అమరావతి సర్కిల్‌లో ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పునరుజ్జీవం పోసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ.. ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ ​వేడుకలతో పాటు సామాజిక బాధ్యతగా, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు..

ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాద్, ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, కార్పోరేటర్లు, క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జీలు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.