
మదనపల్లె: అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఏకగ్రీవంగా ఎంపిక చేయడంపై జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు.
అమరావతి బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చల్లో 11 పార్టీలలో 10 పార్టీలు అనుకూలంగా ఓటు వేసినట్టు, కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరించిందని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభల నుండి వైసీపీ దూరంగా ఉండడం వారి వైఖరిని స్పష్టంగా చూపిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉండడం వైసీపీకి ఇష్టం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన సందర్భాన్ని ఆనందంగా జరుపుకున్నారు.