దీపం పరబ్రహ్మస్వరూపంగా ఆరాధించే హిందువులకు విశిష్టమైన దీపావళి పండుగ సందర్భంగా నా పక్షాన, జనసేన పక్షాన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. చీకటి నుంచి వెలుగుల వైపు నడిపించేదే దీప జ్యోతి.. అటువంటి ఈ దీపాల పండుగ ప్రజలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను . దుష్ట శిక్షణ… శిష్ట రక్షణ సారమే హిందూ పండుగల పరమార్థం . దుర్మార్గుడైన నరకా సురుని అంతంతో కలిగిన సంతోషానికి ప్రతీకగా మనం దీపావళిని జరుపుకొంటున్నానానిము. ప్రజలను పట్టి పీడించే ఆధునిక నరకా సురులు ఎందరో యధేచ్చగా సంచరిస్తూ ప్రజల మాన ధన ప్రాణాలను దోచుకుంటున్నారు. అటువంటి అపర నరకా సురుల బెడద తొలగిపోవాలని , ప్రజలు నిర్భయంగా నిర్భీతితో నడయాడే మంచి రోజులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.