మంగళగిరి: తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న టిడ్కో గృహాలలో గత కొన్ని రోజుల నుంచి నీటి సరఫరాకు అంతరాయం కలగటం వల్ల తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు దృష్టికి రావడంతో వెంటనే స్పందించి మంచినీటి వాటర్ ట్యాంకులను పంపించడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జోరు వానలో కూడా మా యందు దయ ఉంచి స్పందించి నందుకు చిల్లపల్లి శ్రీనివాసరావుకు టిడ్కో గృహాలలో ఉన్న ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేయటం జరిగింది.