విశాఖ జిల్లా, పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న అర్జిల్లి అప్పలరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యుల పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.కేసు నమోదు చేసినా పురోగతి లేదు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారు బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.కేసు నిమిత్తం పరవాడ పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పురోగతి లేకపోవడంతో విచారణ త్వరగా పూర్తి చేసి నేరస్తులను ఎంతటి వారినైనా వెంటనే అరెస్టు చేయాలని అప్పలరాజు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు.