ఉపాధి శ్రామికులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసిన జనసేన నేతలు

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఎండ తీవ్రత మధ్య ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న శ్రామికులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ, బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు, పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకుడు తోట నాగేష్, సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

జనసేన సీనియర్ నాయకుడు జవ్వాది బద్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో మండలంలోని ఉపాధి శ్రామికులకు మజ్జిగ, బిస్కెట్లు అందజేసి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే శ్రామికుల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వేసవి కాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోనేటి రంగబాబు, బత్తుల బాబురావు, గోపి, గొల్లపేట కె. నాని తదితరులు పాల్గొని శ్రామికులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.