
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన టెస్లా సంస్థ హైదరాబాద్‌లో తన కొత్త అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. మాధాపూర్‌లోని నాలెడ్జ్ సిటీ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రం భారత్‌లో టెస్లా సంస్థకు ఐదవ అనుభవ కేంద్రంగా నిలిచింది.
ఈ కేంద్రంలో వినియోగదారులు కొత్త తరం మోడల్ వై వాహనాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం పొందనున్నారు. సంస్థ ప్రతినిధుల మార్గదర్శకత్వంలో వాహనాల ప్రత్యేకతలు, సాంకేతికత, పనితీరు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో త్వరలోనే టెస్లా వేగవంతమైన ఛార్జింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.
హైదరాబాద్‌లో టెస్లా ప్రవేశం ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.