ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం

తాడేపల్లిగూడెం: ప్రజల భాగస్వామ్యంతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన P4 (పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌) విధానంలో భాగంగా ఈ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు.

విద్యాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న ఈ ప్రతిష్టాత్మక నిర్మాణానికి కీర్తిశేషులు దింటకుర్తి వెంకట కృష్ణారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి D.V.K. గీతామణి రూ.5,00,000 విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని ఒక తరగతి గది నిర్మాణానికి వినియోగించనున్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే ఉద్దేశంతో అందించిన ఈ సహకారాన్ని కళాశాల నిర్మాణ నిర్వాహకులు అభినందించారు. విద్యాభివృద్ధికి ప్రజలు అందిస్తున్న సహకారం నిర్మాణ కార్యక్రమానికి మరింత తోడ్పాటునిస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.