
మేడ్చల్: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం ఆధ్వర్యంలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా నిహారిక నాయుడు, యడమ రాజేష్, కె. రామకృష్ణ, కె. మోహన్ రావు, ఎన్. రామ్ బాబు, నరేందర్ సర్కార్ మరియు పలువురు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.