
మేడ్చల్–మల్కాజిగిరి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాహిత సిద్ధాంతాలు, పారదర్శక రాజకీయ ధోరణులకు ఆకర్షితులై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి నిహారిక నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర సర్కార్ తమ అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే ఈ చేరికలకు కారణమని తెలిపారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం పార్టీ బలాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు