
శింగనమల నియోజకవర్గం: నార్పల మండలంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. నార్పల గ్రామ పంచాయతీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మండల నాయకులు పూలమాలలు వేసి ఆయనకు గౌరవం తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళిత వర్గాల అభ్యున్నతి మరియు కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ అని గుర్తు చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఆయన చూపిన మార్గం ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆయన కలల భారత నిర్మాణం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని తెలిపారు. “జోహార్ అంబేద్కర్” అంటూ నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, పొన్నతోట రామయ్య, షైక్ రహంతుల్లా, తుపాకుల సురేష్, చరణ్‌కుమార్, లోకేష్, అశోక్, నారాయణస్వామి మరియు జనసైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.