
మెహబూబ్ నగర్: భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ 2వ వార్డు మెంబర్ గోపే లక్ష్మీనారాయణ పాల్గొని అంబేద్కర్‌కు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మనుషులను బానిసలుగా మార్చేందుకు ఎంతోమంది రాజులు వచ్చారు, కానీ బానిసలను మనుషులుగా నిలబెట్టేందుకు వచ్చిన మహానుభావుడు అంబేద్కర్” అని కొనియాడారు.
తాను చదువుకొని సమాజంలో గౌరవంగా జీవించడం, ఒక పని చేసుకోవడం, రాజకీయంగా ఎదగడం ఇవన్నీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమయ్యాయని తెలిపారు. తన జీవితంలో సాధించిన ప్రతి విజయానికి ఆయననే కారణమని అన్నారు.
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, రాజ్యాంగ ఫలాలు మరియు అధికారాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చేయడంలో తన వంతు కృషి చేస్తానని గోపే లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.