యనమల రామకృష్ణుడిని పరామర్శించిన సానా సతీష్ బాబు

అమరావతి: మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఆదివారం పరామర్శించారు.

ఇటీవల అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన యనమల రామకృష్ణుడు వైద్యుల సూచన మేరకు స్టెంట్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

శస్త్రచికిత్స అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని నివాసంలో కలిసిన సానా సతీష్ బాబు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అందుతున్న వైద్య సేవల వివరాలను కూడా తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.