
కాకినాడ ఎంపీ ఉదయ్ గారి కృషి ఫలితంగా కోకనాడ ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజు నడపడంతో పాటు సామర్లకోట వద్ద స్టాప్ మంజూరు చేయబడింది. ఈ అంశంపై ఎంపీ గారు 2024 డిసెంబర్‌లోనే రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాసి విజ్ఞప్తి చేశారు.
అనంతరం పలుమార్లు వ్యక్తిగతంగా ఫాలోఅప్ చేస్తూ, ఇటీవలి బడ్జెట్ సమావేశాల సమయంలో రైల్వే మంత్రిని ప్రత్యేకంగా కోరడంతో ఈ నిర్ణయం వెలువడింది.
దీని ప్రకారం:
• 12776 (లింగంపల్లి → కాకినాడ టౌన్) రైలు 21.04.2026 నుండి ప్రతిరోజు నడుస్తుంది
• 12775 (కాకినాడ టౌన్ → లింగంపల్లి) రైలు 22.04.2026 నుండి ప్రతిరోజు నడుస్తుంది
అదనంగా, చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్న సామర్లకోట రైల్వే స్టేషన్ వద్ద స్టాప్ కూడా మంజూరు చేయబడింది.
ఈ రెండు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించడంతో కాకినాడ ప్రజలు, రైల్వే ప్రయాణికుల సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎంపీ ఉదయ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించనుంది.