
అమలాపురం: భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సమావేశం ఏప్రిల్ 13, సోమవారం మధ్యాహ్నం 3:00 గంటలకు డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు ప్రెస్ క్లబ్ భవన్‌లో జరుగనుంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షత వహిస్తారు.
సమావేశానికి జిల్లా కోర్ కమిటీ సభ్యులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. అదేవిధంగా కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, మైనారిటీ మోర్చా, యువ మోర్చా, ఎస్‌సీ మోర్చా, ఎస్‌టీ మోర్చా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు కూడా హాజరవుతారు. జిల్లా సర్ కన్వీనర్, కో-కన్వీనర్లు మరియు నియోజకవర్గ బి.ఎల్.ఏ 1 సభ్యులు కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులుగా ఉన్నారు.
అందరూ సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.