
గుండె శస్త్రచికిత్స అనంతరం క్రాంతి మాస్టారును పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
బుట్టాయగూడెం గ్రామానికి చెందిన క్రాంతి మాస్టారు ఇటీవల గుండెకు సంబంధించిన అనారోగ్యంతో స్టంట్ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకున్న పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు బుధవారం నేరుగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
క్రాంతి మాస్టారు ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యం ఎలా ఉందో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ప్రజలతో తనకు ఉన్న అనుబంధంలో భాగంగా ఆపదలో ఉన్నవారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వయంగా పరామర్శిస్తూ వారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పూనెం రాజా, ఏసుబాబు, మారిశెట్టి అనిల్, కరాటం సతీష్, ఫణి, వెంకటేశ్వరరావు,నెలటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.