మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

పోలవరం: మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

బుట్టాయిగూడెం మండలం రేగులకుంట గ్రామానికి చెందిన సోడెం బుచ్చన్న ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పూనెం రాజా, కరాటం సతీష్, సింగులూరి ఏసుబాబు, మారిశెట్టి అనిల్, ఫణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.