





పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో రోల్ మోడల్‌గా రూపుదిద్దుకుంటోందని శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో నాగబాబు గారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, మహా సౌర యాగం నిర్వహించారు.
అనంతరం గోకులం హోటల్‌లో జనసేన నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదే సమయంలో పిఠాపురానికి చెందిన బాలిక డొల్ల వర్షిణి మెదడు శస్త్రచికిత్స కోసం జనసైనికుడు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. నాగబాబు గారు చేతుల మీదుగా చెక్కు అందజేశారు.