జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీల నియామకానికి మరికొద్ది వారాల సమయం

ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ సంస్థాగత కమిటీల జాబితాను సమీక్షించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన 36 వేలకు పైగా దరఖాస్తులను, ఆయన స్వీయ పర్యవేక్షణలో పనిచేస్తున్న కమిటీ బృందం పరిశీలించిన అనంతరం సమర్పించిన జాబితాలో అవసరమైన పలు మార్పులు, సవరణలు చేయాలని నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, జనసైనికుడు, వీరమహిళకు తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం దక్కేలా ఎంపిక ప్రక్రియను మరింత సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించి కమిటీలను ఏర్పాటు చేసేందుకు మరికొద్ది వారాల సమయం తీసుకుని పూర్తిచేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.