
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రావుల రాజేంద్రప్రసాద్ అన్నారు.
మంగళవారం విజయవాడ గుణదలలోని మేరీ మాత ఆలయంలో చర్చ్ ఫాదర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా రావుల రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ఆకాంక్షించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాలో రోడ్ల సమస్యలను ప్రస్తావించగానే వెంటనే స్పందించి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.
డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్న శాఖలు అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే ముందున్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర జనసేన నాయకులు కామళ్ళ సోమనాథం, ముత్యాల కృష్ణ, డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ, రామకృష్ణ, దోమకొండ అశోక్, రుద్ర శేఖర్ నాయుడు, కెంబూరి కృష్ణ, దాసరి నాగరాజు, వీర మహిళ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.