
తిరుపతి: జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం తన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా.. నగర అధ్యక్షులు రాజారెడ్డి, సుమన్ బాబు, హరి శంకర్, రాజేష్ ఆచారి, బాలు, సుధాకర్, ముని రాజా, శివ తదితరులతో కలిసి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ బర్త్తడే కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయనకు జనశ్రేణులు పూల బొకేలు ఇచ్చి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.