



హైదరాబాద్, ఏప్రిల్ 22, 2026: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు బుధవారం ఉదయం పరమపదించారు. వయో సంబంధిత సమస్యలతో కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు.
కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకునేందుకు ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ జూబిలీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో ఉంచనున్నారు.
తన అంత్యక్రియలను హైదరాబాద్‌లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో నిర్వహించాలని ఆయన ముందుగానే కుటుంబ సభ్యులకు సూచించారు. ఆయన ఆకాంక్ష మేరకు గురువారం (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.