







మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో సుదర్శన హోమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకుడు గంజి చిరంజీవి కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుని దీవెనలు పవన్ కళ్యాణ్ గారిపై ఉండాలని, త్వరగా కోలుకొని తిరిగి ప్రజా పరిపాలనలో చురుకుగా పాల్గొనాలని ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ గారు పాల్గొన్నారు. అలాగే జనసేన నాయకులు తోట సత్యనారాయణ, కార్యకర్తలు, వీర మహిళలు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ సుదర్శన హోమం భక్తిశ్రద్ధలతో సాగింది.