వలస కార్మికుల పిల్లల కోసం 236 సీజనల్ హాస్టల్స్ – పవన్ కళ్యాణ్ చొరవకు ప్రశంసలు

మన Hon’ble డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో వలస కార్మికుల పిల్లల కోసం రాష్ట్రవ్యాప్తంగా 236 సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా 11,000 మందికి పైగా చిన్నారులకు ఆసరా లభించనుంది. ఇందులో భాగంగా ఒక్క కర్నూలు జిల్లాలోనే 4,000 మంది చిన్నారులకు మేలు కలగనుంది.

బీహార్‌కు చెందిన పిల్లలకు హిందీ, ఒడిశా పిల్లలకు ఒరియా భాషలోనే శిక్షణ అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. పిల్లలు తమ మాతృభాషలోనే విద్యను అందుకునేలా చర్యలు తీసుకోవడం అభినందనీయంగా భావిస్తున్నారు.

వలస కార్మికుల పిల్లల విద్యాభివృద్ధికి దోహదపడే ఈ నిర్ణయం గొప్ప ఆలోచనగా ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.