
మార్కాపురం: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం “మీకోసం” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 35 ఫిర్యాదులు అందాయి.
మార్కాపురం అడిషనల్ ఎస్పీ, ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, భూ వివాదాలు, ఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు.
అందిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ యు. నాగరాజు, సీఐలు వినోద్‌కుమార్, సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.