







అవనిగడ్డ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు మంగళవారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు.
దేవస్థాన ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ తమ అర్చక బృందంతో కలిసి హోమాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వందలాదిగా పాల్గొన్నారు.