పార్టీ బలోపేతానికి నిబద్ధత కలిగిన కార్యకర్తలకు అవకాశాలు

కడప : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం ఆధ్వర్యంలో కడపలోని హరిత హోటల్‌లో పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమం నాలుగో రోజు విజయవంతంగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేల్ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ కమిటీల్లో బాధ్యతలు చేపట్టి సంస్థాగత బలోపేతానికి సేవలందించాలనే సంకల్పంతో తమ దరఖాస్తులను సమర్పించారు.

ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ, జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టంగా నిర్మించాలనే లక్ష్యంతో నిబద్ధత, సేవాభావం కలిగిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు కల్పించేందుకు ఈ సమాచార సేకరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వీకరించిన అన్ని దరఖాస్తులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పరిశీలనకు పంపనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ జనసేన నిర్మాణ సమాచార సేకరణ కమిటీ సభ్యులు పండ్రా రంజిత్ కుమార్, గోగు లక్ష్మీ భరత్, ఈశ్వర్ రెడ్డి, నందకిషోర్, మెటిమొర రాముడు, చలపతి, సిహెచ్ సిద్ధాంత్, జి. విజయ్, రామ్ సిద్ధు, తోట బాలచంద్రుడు, మాదాసు మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.