సేవా కార్యక్రమాలకు గుర్తింపు.. విజయరావు నరసింహరావుకు ఘన సన్మానం

మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని విహారి గ్రాండ్ ఇన్‌లో ఆదివారం నిర్వహించిన మార్కాపురం లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా గత రెండేళ్లుగా లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు విశేష సహకారం అందిస్తూ సమాజ సేవలో చురుకైన పాత్ర పోషిస్తున్న క్లబ్ డైరెక్టర్, జనసేన నాయకుడు విజయరావు నరసింహరావును ముఖ్య అతిథి, లయన్స్ క్లబ్ గవర్నర్ ఆర్. లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజ సేవే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని, సేవాభావంతో పనిచేసే సభ్యుల సహకారంతో సంస్థ మరింత విస్తృతంగా ప్రజలకు సేవలందిస్తోందన్నారు. సేవా కార్యక్రమాల్లో విజయరావు నరసింహరావు చూపుతున్న అంకితభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.

కార్యక్రమంలో మార్కాపురం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు కశెట్టి జగన్‌బాబు, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, శిరిగిరి శ్రీనివాసులు, ఉమ్మడి రవీంద్ర, కంబం వెంకటరమణ, వాసవి ప్రియా, పిచ్చయ్య, నూతన కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.