రాజమహేంద్రవరంలో రాష్ట్ర వర్తక మహాసభ

రాజమహేంద్రవరం : ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వర్తక మహాసభతో పాటు జనరల్ బాడీ సమావేశం రాజమహేంద్రవరంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక రంగ ప్రతినిధులు పాల్గొని వాణిజ్య రంగ అభివృద్ధి, వ్యాపార అవకాశాలు, పరిశ్రమల పురోగతిపై చర్చించారు.

అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీతో పాటు కుప్పాల రామకృష్ణ, కొవ్వూరు వెంకటరెడ్డి, తిక్కిరెడ్డి రాంబాబు, నిమ్మకాయల సుబ్బారావు, రావూరి దొరబాబు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై అభిప్రాయాలు వెల్లడించారు. సమావేశంలో వ్యాపార వర్గాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.