పవన్ కళ్యాణ్‌పై దుష్ప్రచారాలు ఆపాలి: హరిబాబు రాయల్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన బాధ్యతగా భావించి, పరిపాలన దిశలో తనదైన ముద్ర వేస్తూ పవన్ కళ్యాణ్ ప్రతి శాఖలో ప్రక్షాళన దిశగా పనిచేస్తున్నారని జనసేన కువైట్ టీం అధ్యక్షుడు యర్రంశెట్టి హరిబాబు రాయల్ పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాటపటిమను చూపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. అదే కారణంగా ప్రతిరోజూ ఆయనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించి, కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను జనసేన పార్టీ కువైట్ టీం మరియు కార్యవర్గ సభ్యులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు.

యర్రంశెట్టి హరిబాబు రాయల్ మాట్లాడుతూ.., ప్రజలు ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజా పరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని గుర్తించాలని ఆయన అన్నారు. ఆయనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలే తగిన విధంగా తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిపై అవాస్తవాలను వ్యాప్తి చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలే నిలువరించగలరని జనసేన కువైట్ టీం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.