కల్లూరు మండలంలో జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలం చిన్నటేకూర్ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమం జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్, పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింత సురేష్ బాబు మార్గదర్శకత్వంలో జరిగింది.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వై. బజారి మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతం ద్వారా సుమారు 18 గ్రామాలకు ప్రయాణికులు వెళ్లే మార్గం ఉండటంతో మధ్యాహ్న సమయాల్లో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వారంలో ఒకరోజు మజ్జిగ, మరొక రోజు బెల్లం పానకం, మిగతా రోజుల్లో మినరల్ వాటర్ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి. హుస్సేన్, బి. రంగస్వామి, జి. శివ, వై. తిమ్మరాజు, శ్రీకాంత్, ఎం. రాజు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.