

విజయనగరం: ముంబయిలో భుజం శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని విజయనగరంలో జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి.
జనసేన నేత గురాన అయ్యలు–రాధిక దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు, ప్రార్థనలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవను కొనసాగించాలని అమ్మవారిని వేడుకున్నారు.
పూజల అనంతరం ఆలయం ఎదుట రోడ్డుపై జనసేన నాయకులు, కార్యకర్తలు సాంప్రదాయబద్ధంగా పెద్ద సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వారు, పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళా నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.