జనసేన ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ భేటీ

మంగళగిరి: విజయవాడ–మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నాయకులు పరస్పరం చర్చించారు.

పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలతో అనుసంధానాన్ని పెంపొందించే దిశగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ సమావేశంలో పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని పార్టీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.