
గంగాధర నెల్లూరు: గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామంలో అంకాల పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు తోట శ్రీనివాస్ హాజరై అంకాల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా తోట శ్రీనివాస్ ఆలయ కుంభాభిషేక మహోత్సవాల నిర్వహణకు తన వంతు సహకారంగా రూ.5,000 విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించినందుకు ఆలయ నిర్వాహకులు జనసేన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు లోకనాథ్ నాయుడు, పార్లమెంట్ కమిటీ సభ్యులు పూల ప్రభాకర్, నాన్న బాల, కాంజేరి చందు, సామంతి సురేష్, మండల అధ్యక్షుడు చిరంజీవి, పుల్లూరు మాజీ సర్పంచ్ పవన్, సుమన్ రాయల్, ఎం.ఎన్.ఆర్. చందు, మండల ఉపాధ్యక్షుడు చార్లిస్, కార్వేటినగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, మండల ఉపాధ్యక్షుడు విజయ్, పెనుమూరు మండల ఉపాధ్యక్షుడు బాలాజీ, దయా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.