
అనంతపురం అర్బన్: బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా గాజుల పద్మజ ఎన్నిక కావడం అనంతపురం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. న్యాయవాదులకు, కళాకారులకు సేవ చేసే అవకాశం పద్మజకు లభించడం ఆమె కుటుంబ ఆశీస్సుల ఫలితమని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె తండ్రి నారాయణస్వామి ఆశీస్సులు ఆమెకు తోడయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ టి.సి. వరుణ్ మాట్లాడుతూ, పద్మజ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆమె న్యాయవృత్తిలో మరింత సేవ చేసి మంచి పేరు సంపాదించాలని అన్నారు.
నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్, కాయగూర లక్ష్మీపతి, ఏఎంసి డైరెక్టర్లు అవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పద్మజ స్వగృహంలో ఆమెను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.