

పుట్టపర్తి: అనంతపురంలో డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జడ్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశానికి మార్గదర్శిగా నిలిచిన మహానుభావుడని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మేధావిగా ఆయన ఖ్యాతి గడించారని తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే సమానత్వం మరియు సామాజిక న్యాయం సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు.