
అమలాపురం కిమ్స్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవి కిరణ్ వర్మ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ దేశానికి చేసిన అపార సేవలను గుర్తుచేశారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే భారతదేశం వైవిధ్యంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తే దేశ పురోగతిలో భాగస్వాములు కావచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన రాజు మాట్లాడుతూ, అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యతను బలంగా ప్రతిపాదించిన మహనీయుడని చెప్పారు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని వివరించారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ డీన్ డా. ఆనంద్ ఆచార్య, మెడికల్ డైరెక్టర్ డా. హరి కిరణ్ వర్మ, సి.ఏ.ఓ. రఘు, మానవ వనరుల జి.ఎం. రాధా మనోహర్, విజిలెన్స్ మరియు సెక్యూరిటీ జి.ఎం. కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కిమ్స్ వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు