భీమవరం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడిగా చెరుకూరి సాయిరామ్ నియామకం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరామ్‌ను భీమవరం నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, స్థానిక రాజకీయ పరిస్థితులపై పర్యవేక్షణ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చెరుకూరి సాయిరామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరామ్‌ను భీమవరం నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, స్థానిక రాజకీయ పరిస్థితులపై పర్యవేక్షణ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

భీమవరం నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా మార్చడం, నాయకులు మరియు కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందనను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.

ఈ నియామకంతో భీమవరం నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చెరుకూరి సాయిరామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

bh

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.