
తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బనానా క్లబ్ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మరియు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సంయుక్తంగా ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా షోరూమ్‌ను సందర్శించిన అతిథులు అక్కడ అందుబాటులో ఉన్న నాణ్యమైన వస్త్రాలు, ఆధునిక డిజైన్లు, వినియోగదారులకు అందిస్తున్న ప్రత్యేక సేవలను పరిశీలించి యాజమాన్యాన్ని అభినందించారు.
డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, తిరుపతి వంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. యువ పారిశ్రామికవేత్తలు వ్యాపార రంగంలో ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
అనంతరం బనానా క్లబ్ షోరూమ్ యజమాని ప్రభాకర్‌ను డా. హరిప్రసాద్, వెంకయ్య చౌదరి అభినందించి, వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, నాణ్యమైన ఉత్పత్తులు మరియు మెరుగైన సేవల ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో షోరూమ్ యాజమాన్య ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, అభిమానులు, ఆహ్వానితులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.