
ఎస్.కోట: తిమిడి గ్రామంలో అశ్విని ఫార్మసీని ఆదివారం జనసేన నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఫార్మసీని ప్రారంభించిన ఆయన, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
తిమిడితో పాటు వసి, వేచలపూడి, చింతాడ, ఉసిరి గ్రామాల ప్రజలకు ఈ ఫార్మసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మందుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా సేవలు పొందాలని గ్రామస్తులను కోరారు.
ఫార్మసీ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక రామకోవెల వద్ద సంజీవని హాస్పిటల్ సౌజన్యంతో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ పీడియాట్రిక్ నిపుణుడు డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అలాగే సప్తగిరి కంటి ఆసుపత్రి సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ భోలీ రెడ్డి అశ్విని, ఆర్.ఎం.పీ డాక్టర్ కొల్లి సురేంద్ర, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.