
అమలాపురం: వ్యవసాయ కార్మిక సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికలు కోనసీమలో నిర్వహించగా, రాష్ట్ర అధ్యక్షురాలిగా డి. రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా కె. లోకనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా కంకణాల ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాంభూపాల్, దడాల సుబ్బారావు, వి. రాణి, డి. వెంకన్న, టి. ముత్యాలమ్మ, జే. సత్యనారాయణ, కె. కళ్యాణ్, ఈ. అప్పారావు, దేవ కుమారి, నరసింహ నాయక్ ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర కార్యదర్శులుగా వి. వెంకటేశ్వర్లు, పి. రామకృష్ణ, ఎం. పుల్లయ్య, ఎం. కృష్ణమూర్తి, వి. అన్వేష్, కే. నారాయణలను ఎన్నుకున్నారు.
రాష్ట్ర కమిటీ సభ్యులుగా శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు పలు జిల్లాలకు చెందిన నాయకులను ఎంపిక చేశారు. వివిధ జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులకు కూడా స్థానం కల్పించారు.
సంఘం బలోపేతం, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నూతన కమిటీ కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.