జనసేన బలోపేతానికి కార్యకర్తలంతా ఏకతాటిపైకి రావాలి’

  1. భూపాలపల్లి నియోజకవర్గం పిఓసి జేరుపోతుల సనత్ కుమార్

భూపాలపల్లి: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా పోరాటాలు నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి నియోజకవర్గం పిఓసి జేరుపోతుల సనత్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై సమర్థవంతంగా పోరాడేందుకు కార్యకర్తలందరూ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 22న సమావేశం

ఆగస్టు 22వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు హన్మకొండలోని శ్రీ హర్ష కన్వెన్షన్ హాల్, కాకా కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురుగా ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు సనత్ కుమార్ వెల్లడించారు.

ఈ సమావేశానికి వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని జనసేన నాయకులు, వీరమహిళలు, అనుబంధ విభాగాల బాధ్యులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

జనసేన పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలమని పేర్కొన్న సనత్ కుమార్.. అందరూ ఐక్యంగా ముందుకు సాగి బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.