
అవనిగడ్డ: ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అస్వస్థతకు గురై విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తున్న నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకోవాలని అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని జనసేన నాయకులు స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సింహాద్రి పవన్, మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పూసడపు రత్నగోపాల్, ఎంపిటిసి బొప్పన భాను, కోసూరు శివజీ, మాజీ ఎంపిటిసి చిలక శ్రీను, నున్న సుబ్బారావు, తుంగల నరేష్, గరికిపాటి శ్రీను, కమ్మిలి సాయి, గురువిందపల్లి అనిల్, బడే ప్రసన్న, తుంగల చరణ్, నవీన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
పిడుగు హరిప్రసాద్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు సేవలందించాలని నాయకులు ఆకాంక్షించారు.