
పాతపట్నం నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్ కొరికాన భవాని స్వగ్రామమైన మిరబిల్లిలోని ఆమె నివాసంలో శ్రీకాకుళం జిల్లా సూడా చైర్మన్ కొరికాన రవికుమార్‌ను జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ సమాచార సేకరణ అబ్జర్వర్ జనసేన జానీ, జనసేన పార్టీ అధ్యక్షుడి టీమ్ మెంబర్ పోరెడ్డి ప్రశాంత్, సీతంపేట మండలం జనసేన యువ నాయకుడు సవర రాజేష్ పాల్గొన్నారు.
ఈ భేటీలో నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై నాయకులు పరస్పరం చర్చించినట్లు తెలిపారు.