
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహా రాణా యడవల్లిని ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ నార్త్ అమెరికా సౌత్ ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్‌గా నామినేట్ చేసింది. ఈ సందర్భంగా మహా రాణా యడవల్లికి పలువురు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కొత్త బాధ్యతల్లో భాగంగా నార్త్ అమెరికా సౌత్ ఈస్ట్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఆయన కృషి చేయనున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు అవసరమైన సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందించనున్నారు.
అదేవిధంగా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు సమాజానికి, మాతృభూమి ఆంధ్రప్రదేశ్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రవాసాంధ్రుల అవసరాలు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్రానికి మరియు ప్రవాస తెలుగు సమాజానికి మధ్య సమన్వయం పెంపొందించేందుకు కృషి చేయనున్నారు.
ఏపీఎన్‌ఆర్‌టీఎస్ లో రీజినల్ కోఆర్డినేటర్‌గా లభించిన బాధ్యత ఒక గౌరవప్రదమైన గుర్తింపుతో పాటు తెలుగు సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశం, బాధ్యత అని పలువురు పేర్కొన్నారు.
కొత్త బాధ్యతల్లో మహా రాణా యడవల్లి విజయవంతంగా ముందుకు సాగుతూ, నార్త్ అమెరికా సౌత్ ఈస్ట్ ప్రాంతంలోని తెలుగు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. తెలుగు సమాజానికి, ఆంధ్రప్రదేశ్‌కు మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన సేవలు కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.