
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గాదె పృథ్వీ, డా. పద్మజదేవి, తమిళనాడు నాయకులు పెద్దన్నాయ, వెంకటేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఆమంచ సునీల్, విద్యార్థి నాయకులు మెడిద ప్రశాంత్ రెడ్డి, బర్ల శివ, వీర మహిళలు బయ్యా పద్మావతి, చెరుకుపల్లి నాగమణి తదితరులు పాల్గొన్నారు.